పటాన్చెరు నియోజకవర్గం
జిన్నారం: బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
జిన్నారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శనివారం ప్రత్యేక అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థుల భోజన గది, రీడింగ్ గది, పడుకునే బెడ్లను పరిశీలించి ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక అధికారి ఎంపీ ఓ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి మాణిక్యం సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో ఏవైనా విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.