సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: కేతకి సంగమేశ్వర స్వామికి పండ్లతో ప్రత్యేక అలంకరణ
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. శివలింగానికి అన్నాభిషేకం, రుద్రాభిషేకం, పాలాభిషేక కార్యక్రమాలను జరిపించారు. పండ్లతో శివలింగానికి ప్రత్యేకంగా అలంకరించారు. శివలింగాన్ని దర్శించుకున్నందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.