జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫీజు వెంటనే చెల్లించాలి
పదవ తరగతి పరీక్ష ఫీజు ఈనెల 18వ తేదీలోపు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పాఠ్యాంశాలకు కలిపి 125 రూపాయలు మాత్రమే పరీక్ష పేజీ చెల్లించాలని పేర్కొన్నారు. 50 రూపాయలు అపరాధ రుసుముతో డిసెంబర్ రెండు వరకు, 200 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 21 తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని చెప్పారు.