గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
దీపావళి పండుగ నేపథ్యంలో గోల్డ్ ప్రియులకు వరుసగా షాకులు తగులుతునే ఉన్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెరగడంతో.. రూ. 73,600 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 710 పెరిగి.. రూ. 80,290 కు చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 1,07,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.