చెరువులు, నాళాల పునరుద్ధరణపై హైడ్రా సమావేశం
HYD: గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయంపై హైడ్రా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు, వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగనున్న ఈ సమావేశంలో.. మేధావుల సలహలు, సూచనలను రంగనాథ్ తెలుసుకొనున్నారు.