సూర్యాపేట జిల్లా - Suryapet

వీడియోలు


తెలంగాణ
ఐఐటీలో చదివినా ఉద్యోగాలు కరువేనా...?
Apr 29, 2024, 08:04 IST/

ఐఐటీలో చదివినా ఉద్యోగాలు కరువేనా...?

Apr 29, 2024, 08:04 IST
ఐఐటీలో చదివి మంచి ఉద్యోగం సాధించాలనేది ప్రతి విద్యార్థి కల. టెన్త్ పాసైన విద్యార్థులకు కానీ, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు కానీ ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచేది ఐఐటీ. అలాంటి ఐఐటీలో చదివిన విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ రాకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఐఐటీ చేస్తే అప్పట్లో రూ.10 లక్షల ప్యాకేజీకి తక్కువ ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఐఐటీకి ఆదరణ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో కేవలం 3, 4 లక్షల ప్యాకేజీలకే ఉద్యోగం చేస్తున్న వారూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దీనికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చే Qs ర్యాంకింగ్‌లో బాంబే ఐఐటీ 149 ర్యాంక్‌లో ఉంది. అయితే బాంబే ఐఐటీలో ప్లేస్ మెంట్స్ రాని వారు 36 %, ఐఐటీ మద్రాస్‌లో 32.6%, కాన్పూర్ ఐఐటీలో 35% మందికి ప్లేస్ మెంట్స్ రావడం లేదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెటావర్స్ లాంటి కోర్సులకు మనకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కావున ఐఐటీ జాబ్స్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ తగ్గడం కూడా కారణాలే.