జనగామ: చూపరులను ఆకట్టుకుంటున్న శంకుచక్ర నామాలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నీడిగొండలోని కాకతీయుల కాలం నాటి లక్ష్మీనరసింహస్వామి కొలువైన గుట్టపై దాత సహాయంతో శంకు చక్రాల నామాలు వేశారు. కార్మికులు తాళ్ల సాయంతో నాలుగు రోజులు శ్రమించి 1000 మీటర్ల ఎత్తు 50 మీటర్ల వెడల్పులో 80 లీటర్ల పెయింటింగ్ తో శంకు చక్ర నామాలు వేశారు. శనివారం జాతీయ రహదారి మీదుగా వెళ్లే వారిని ఈ నామాలు ఆకట్టుకున్నాయి.