
కొండమల్లెపల్లి: నేడు నిలిచిపోనున్న విద్యుత్ సరఫరా
కొండమల్లేపల్లిలోని 132/33KV సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా శనివారం మ. 3గం. ల నుంచి సా. 6గం. ల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏడీఈ సైదులు తెలిపారు. కొండమల్లేపల్లి, గుడిపల్లి, అజ్మాపూర్, పుట్టంగండి, అంగడిపేట, నేరడుగొమ్ము, చిత్రియాల సబ్ స్టేషన్ ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.