

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి
ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు ఎండిపోకుండా ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. పరిధిలో ఉన్న ఫీడర్ ఛానళ్లు, సబ్ మైనర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే సాగునీరు సులభంగా వస్తుందని, అలాగే వచ్చే సీజన్ కు నీరు సులభంగా అందుతుందని అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ గుర్రంపోడు, కనగల్ మండలాల పరిధిలో డి-25 కెనాల్ ను తనిఖీ చేశారు.