
రాజమండ్రి రూరల్: మర్డర్ కేసులో ముద్దాయి అరెస్ట్
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట డిబ్లాకుకు చెందిన తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో ముద్దాయి శివకుమార్‌ను కొవ్వూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య సోమవారం తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ నిందితుడిని పట్టుకున్నారన్నారు. యువతి వేరొకరితో ఫోన్లో మాట్లాడుతోందని అది సహించకే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.