
రాజమండ్రి రూరల్: వైభవంగా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం
రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మంగళవారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు.