మసీదుపై ఇజ్రాయిల్ బాంబులతో దాడి.. 21 మంది మృతి
గాజా స్ట్రిప్‌లోని ఒక మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబు దాడుల్లో 21 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. డీర్ అల్ -బలాహ్ ప్రాంతంలోని షుహాదా అల్-అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుపై ఇజ్రాయెల్ బాంబు దాడులకు దిగింది. నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఆ మసీదులో తలదాచుకున్నట్లు సమాచారం. హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్‌గా ఆ మసీదును వినియోగిస్తున్నారని పేర్కొన్న ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది.