ఖమ్మం
కామేపల్లి: భూమిని ఆరోగ్యంగా ఉంచుదాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: ఏవో
వరి కోతల తరువాత వరి కొయ్యలను రైతులు కాల్చవద్దని కామేపల్లి మండల వ్యవసాయ అధికారి బి. తారాదేవి కోరారు. వరి కొయ్యలను కాల్చడం వలన కలిగే అనర్ధాలపై ఆదివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొయ్యలను భూమిలోనే కలియ దున్నడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. భూమి ఆరోగ్యం కొరకు పర్యావరణ పరిరక్షణకు రైతులు తోడ్పడాలని కోరారు.