సత్తుపల్లి
సత్తుపల్లి: నీలాద్రి అర్బన్ పార్క్‌ను సందర్శించిన ఎమ్మెల్యే
కల్లూరు అడవి మల్లెల గురుకుల పాఠశాల 7వ తరగతి విద్యార్థులతో కలిసి సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ ను గురువారం ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించారు. తానే టీచర్ గా విద్యార్థినిలకు పార్కులో చెట్లు, వన్యప్రాణులు, ప్రకృతి, సింగరేణి బొగ్గు గనులు గురించి వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో చదువులోనూ, ఉద్యోగ రంగంలో రాణించటానికి సలహాలు ఇచ్చారు.