
రంగారెడ్డి: దేవాలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్పీకర్
సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో పునర్నిర్మించిన 800 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర నాయకులు హాజరయ్యారు.