ఎయిర్ పోర్టుకు రూ.205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లను కేటాయించడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు ఏర్పాటు తన రాజకీయ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు పట్టువదలకుండా శ్రమించి అనుకున్నది సాధించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు పొంచి ఉన్న ముంపును నివారించేందుకు రూ.160.92 కోట్లను విడుదల చేయడం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు.