మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం: CM
కేసీఆర్‌ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలోనే నిర్ణయించుకున్నానని సీఎం రేవంత్ అన్నారు. వేములవాడ సభలో సీఎం మాట్లాడుతూ.. 'ఇందిరమ్మ రాజ్యంలో వేములవాడను అభివృద్ధి చేసుకుంటున్నాం. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం. ఈ ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 30న మరోసారి ఉత్తమ్‌కుమార్ ఇక్కడకు వచ్చి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారు' అని వ్యాఖ్యానించారు.