గజ్వేల్
మర్కుక్: మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో అనారోగ్యంతో శెట్టి శివయ్య, నెంటూరి సాయమ్మ చనిపోయారు. పాములపర్తి మాజీ సర్పంచ్ తిరుమలరెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాములపర్తి మాజీ సర్పంచ్ తిరుమలరెడ్డి, మండల్ ప్రెసిడెంట్ తాండ కనకయ్య గౌడ్ పాల్గొన్నారు.