బాపట్ల: అక్రమ ఇసుక తవ్వకాలను కట్టడి చేయండి
బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో ఎన్ ఓ సి సర్టిఫికెట్ తీసుకోకుండా అక్రమంగా 30 నుండి 40 అడుగుల వరకు ఇసుక నవ్వుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జై భీమ్ రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయ్ రాజు సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్ కు ఫిర్యాదు చేశారు.