
తిరువూరులో టిడిపి సభ్యత్వ కార్డులు అందించిన ఎమ్మెల్యే
తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. తిరువూరు, ఏ. కొండూరు మండలాల బూత్ లెవెల్ టిడిపి సభ్యత్వం పొందిన కార్యకర్తలు నాయకులకు ఎమ్మెల్యే కార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.