20 ఏళ్ల సేవకు కేసీఆర్ ఆత్మీయ సన్మానం (వీడియో)
నిత్యం వెన్నంటి ఉంటూ తన కష్టసుఖాల్లో తోడుగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి BRS పార్టీ అధినేత కేసీఆర్ భావోద్వేగ వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ ఇన్చార్జ్గా దాదాపు 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆయన కుటుంబంతో కలిసి నివసించేందుకు అమెరికాకు వెళ్తుండడంతో ఆయనకు ఆత్మీయంగా బంగారు గొలుసు, పట్టువస్త్రాలు సమర్పించి కేసీఆర్ సాగనంపారు.