ఆఫీసులోనే సిబ్బందితో మసాజ్ చేయించుకున్న అధికారి (వీడియో)
యూపీలోని గ్రామ పంచాయతీ అధికారి తన కార్యాలయాన్ని మసాజ్ సెంటర్‌గా మార్చారు. సంత్ కబీర్‌నగర్‌లో ఓ ప్రభుత్వ అధికారి కూర్చీపై కూర్చొని కింది స్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటూ బహిరంగంగా దొరికిపోయాడు. ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు.. ఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.