తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన బండి సంజయ్ (వీడియో)
తిరుమల లడ్డు వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళనగా ఉందని అన్నారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.