క్లాస్ రూమ్లో పిచ్చి కొట్టుడు కొట్టుకున్న విద్యార్థులు (వీడియో)
ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. చెప్పులతో సైతం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనను తోటి విద్యార్థులు వీడియో తీసి వైరల్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీలో కామన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.