
దారుణం.. నాలుగేళ్ల బాలుడిని చంపిన 12 ఏళ్ల బాలిక
నాలుగేళ్ల చిన్నారిని 12 ఏళ్ల బాలిక హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రామ్‌కుమార్ భార్య, పిల్లలతో కలిసి గ్వాలియర్‌లోని ఓ టౌన్ షిప్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలిక వచ్చి బాలుడిని బయటికి తీసుకెళ్లింది. బాలుడు ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో వెతకగా కాలువలో మృతదేహం కనిపించింది. ఆరా తీయగా బాలిక గొంతు నులిమి హత్య చేసి కాలువలో పడేసినట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలికను అదుపులోకి తీసుకున్నారు.