బాల్కొండ - Balkonda

వీడియోలు


నిజామాబాద్ జిల్లా
Apr 30, 2024, 04:04 IST/

అభివృద్ధికి ఓటేయండి.. ఎంపీగా గెలిపించండి

Apr 30, 2024, 04:04 IST
ఆలూరులో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ, ఆపదలో అండగా నిలుస్తామని.. అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రచారం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని, పదేళ్ల టిఆర్ఎస్, బిజెపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు వివక్షకు గురయ్యారు. మరోసారి బిజెపికి ఓటేసి మోసపోవద్దని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ కి ఓటేయాలి అని పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని, కాంగ్రెస్ పాలనలోనే గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఇండియా కూటమీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలకు రోజువారి వేతనం రు.400 పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులను చేసేందుకు దేశవ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. మరోసారి పొరపాటు చేయొద్దు రైతులను మోసం చేసిన బిజెపిని గుణపాఠం చెప్పాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు ఆలోచించి..కాంగ్రెస్ ఓటు వేసి గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు. వర్మ నియోజవర్గంలో సమస్యలు పరిష్కరించేందుకు వినయ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపుతానని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. తనను ప్రజలు ఎంపీగా గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషిచేసిన.. పాస్పోర్ట్ ఆఫీస్ ఏర్పాటుచేసిన అని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా జీవన్ రెడ్డి జీవితకాలం ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ మాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని అన్నారు. మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. జీవన్ రెడ్డి ని గెలిపిస్తే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. జీవన్ రెడ్డికి ఓటు వేసి ఎంపీగా పార్లమెంటు పంపాలని మదుయాష్కీగౌడ్ పిలుపునిచ్చారు.