
ఖమ్మం
పోరాటాల పురిటి గడ్డగా ఖమ్మం ఖ్యాతి: బాగం
కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో పోరాటాల పురిటి గడ్డగా ఖమ్మం ఖ్యాతి గడించిందని, అమరుల త్యాగాలు ఎర్ర జెండాను మరింత ఎరుపెక్కించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు వెల్లడించారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా గురువారం ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడారు. నగరంలోని గణేశ్వరం, వినోభానగర్, తోటపల్లి లాంటి చారిత్రక భూపోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నేతృత్వం వహించిందని తెలిపారు.