Top 10 viral news 🔥
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన అల్లు అర్జున్
మాజీ మంత్రి కేటీఆర్, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి సురేఖ వ్యాఖ్యలను స్టార్ హీరో అల్లు అర్జున్ ఖండించారు. ‘సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలను అవమానించే లాగా మాట్లాడిన మాటలను నేను ఖండిస్తున్నాను. రాజకీయ పార్టీలు మహిళల పట్ల బాధ్యతగా, మర్యాదగా ప్రవర్తించాలి’ అనే పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.