నాగర్ కర్నూల్
నవోదయ ప్రవేశపరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు
బిజినేపల్లి మండలం వట్టెంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరం ఆరోతరగతి ప్రవేశ పరీక్షకోసం దరఖాస్తుల తేదీని ఈనెల 23వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ శాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాగా ఆన్లైన్లో దర ఖాస్తు ఫారాలను సమర్పించవచ్చన్నారు.