పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 795 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 795 ట్రైనీలను రిక్రూట్ చేసుకోనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ powergrid.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22 నుండి ప్రారంభం కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2024 నవంబర్ 12.