కాళ్లమధ్యలో పెట్టి రూ.10 వేల చీరలు నొక్కేసిన మహిళలు (వీడియో)
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో కి‘లేడీ’లు చేతివాటం ప్రదర్శించారు. బట్టలు కొనేందుకు వచ్చి కొన్నట్టే యాక్టింగ్ చేసి రూ.10 వేల విలువైన చీరలను చోరీ చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సిక సారీ సెంటర్లో జరిగింది. ఐదుగురు మహిళలు బట్టలు కొనేందుకు వచ్చి తమ కాళ్ల మధ్యలో పెట్టి రూ.10 వేల విలువైన చీరలు దొంగిలించారు. అనంతరం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.