మృత్యువోడి నుండి బయటపడ్డ మత్స్యకారులు
తుఫాను కారణంగా బంగాళాఖాతం సముద్రంలో చిక్కుకున్న చెన్నై ఫిషింగ్ బోట్ ఉన్న 10 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం ఐసిజిస్ పహరేదార్ కాకినాడ రూరల్ వాకలపూడి వద్ద బుధవారం సాయంత్రం రక్షించింది. చెన్నైకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ లోని సాంకేతిక లోపం కారణంగాతుఫానులో చిక్కుకున్నట్లు విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు 1093టోల్ ఫ్రీ నెంబరుకు సమాచారం అందించడంతో వారిని రక్షించారు.