
రాజమండ్రిలో కూలిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
రాజమండ్రిలో శనివారం సాయంత్రం వచ్చిన ఈదురు గాలులకు, అకాల వర్షానికి నగరంలోని భయానక వాతావరణం చోటు చేసుకుంది. గాలి, వర్ష బీభత్సానికి లాలాచెరువు, విద్యుత్ కాలనీ వంటి ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు పడిపోయాయి. జేపీ రోడ్డు, ఏసీ గార్డెన్స్, బొమ్మూరు తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. దీంతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు పలు అవస్థలకు లోనయ్యారు.