కర్ణాటకలో ‘ముడా’ ప్రకంపనలు.. ఖర్గే కీలక నిర్ణయం
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది