పీలేరు
పీలేరు: మాదకద్రవ్యాల వ్యతిరేక పోస్టర్ విడుదల
మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా NSUI ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను సీఐ యుగంధర్ మంగళవారం పీలేరులో ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస అయితే భవిష్యత్తు అంధకారం అవుతుందని సీఐ తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై పూర్తిగా దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు.