280 పరుగులతో భారత్ ఘన విజయం
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన అశ్విన్ రెండో ఇన్సింగ్స్‌లో 6 వికెట్లతో అదరగొట్టాడు. ఇక భారత్ తొలి ఇన్సింగ్స్‌లో 376/10 పరుగులు చేయగా, బంగ్లా 149 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 287/4 డిక్లేర్డ్ చేసి 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, బంగ్లా 234 పరుగులే చేసింది.