సీఎం రేవంత్ రెడ్డిపై పీఎస్ లో ఫిర్యాదు (వీడియో)
మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును సీఎం రేవంత్ అసభ్య పదజాలంతో దూషించారని HYD బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం వ్యాఖ్యలు భయం గొలిపేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ సమాజానికి ఇవి తీవ్ర అభ్యంతరకరమని చెప్పారు. తమ నాయకులకు ఎలాంటి హాని కలిగినా సీఎం, కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.