ఖమ్మం
రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు తొలగింపు
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని నాలుగో డివిజన్ ఇల్లందు రోడ్డులో చర్చ్ దగ్గర డ్రైనేజీ కాలువ మరియు రోడ్డును ఆక్రమించి కొందరు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు బుధవారం డ్రైనేజీ కాలువ మరియు రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలను జేసిబీతో తొలగించారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.