దేవరకద్ర నియోజకవర్గం
రాష్ట్రస్థాయి ఎస్జిఎఫ్ఐ పోటీలకు కొత్తకోట విద్యార్థుల ఎంపిక
రాష్ట్రస్థాయి ఎస్జిఎఫ్ఐ పోటీలకు దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటకు చెందిన కరాటే అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్జిఎఫ్ఐ సెక్రటరీ శారదాబాయి సోమవారం విద్యార్థులను అభినందించారు. అండర్ 14 విభాగంలో హర్షవర్ధన్, అండర్ 17 విభాగంలో అబ్దుల్ రెహమాన్ ఎంపికయ్యారని అకాడమీ చీఫ్ రఫీ ఉల్లా ఖాద్రీ వెల్లడించారు. తమ అకాడమీ నుంచి గతంలోనూ ఎంతో మంది విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించారాన్నారు.