
షాద్నగర్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి సమీపంలో ప్రజా విశ్రాంతి భవనం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్టు స్థానికులు సోమవారం మీడియాకు తెలిపారు. ఏం జరిగిందో తెలియదు కానీ అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ సిబ్బంది వారికి సమాచారం అందజేసినట్లు తెలిపారు.