
జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్: ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలోని 10 ఆదర్శ పాఠశాలల్లో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 7 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www. tsms. cgg. gov. in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.