నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం
కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ధర్నా
కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.