తెలంగాణలో వన్యప్రాణుల బోర్డుకు కొత్త సభ్యుల నియామకం
తెలంగాణలో వన్యప్రాణుల బోర్డుకు కొత్త సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వన్యప్రాణుల బోర్డుకు సీఎం రేవంత్ ఛైర్మన్, అటవీశాఖ మంత్రి వైస్ ఛైర్పర్సన్గా ఉంటారు. ఎమ్మెల్యేలు, అధికారులు, పర్యావరణవేత్తలు 29 మందితో బోర్డు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, మురళీ నాయక్ బూక్యా, పాయం వెంకటేశ్వర్లు ఉంటారు.