గులాబీ పార్టీలో కీలక పోస్టు ఖాళీ
పదేళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని పార్టీగా కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి.. ఇప్పుడు అధ్యక్షుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కీలక పోస్టుకు ఓ నేత దొరక్కపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పదేళ్లలోనే పార్టీలో ఈ పరిస్థితి రావడంపై కేడర్లోనూ ఆందోళన కనిపిస్తోంది. బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలి పోస్టు ప్రస్తుతం ఖాళీ అయింది. ఓ సమర్థురాలైన అధ్యక్షురాలు బీఆర్ఎస్లో లేకుండా పోయారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.