విశాఖ-విజయనగరం వందేభారత్‌లో 60 కిమీ దూరానికి రూ.435 ఛార్జీ
విశాఖ-దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఛార్జీలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖ-విజయనగరం మధ్య దూరం 60కి.మీ. ఈ దూరానికి వందేభారత్‌లో ఛైర్‌కార్ ఛార్జీ రూ.435 కాగా, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్‌లో రూ.820గా ఉంది. సాధారణంగా డీలక్స్ బస్సులో దాదాపు రూ.100 ఛార్జీ ఉంటుంది. వందేభారత్‌లో నాలుగు రెట్లు అధికం. దీంతో సామాన్యులు ఈ రైలు ఎక్కలేని పరిస్థితి. దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.