Oct 26, 2024, 15:10 IST/
పెట్రోల్ బంక్లో తప్పిన పెను ప్రమాదం (షాకింగ్ వీడియో)
Oct 26, 2024, 15:10 IST
TG: మల్లాపూర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. పంప్ బాయ్ పెట్రోల్ నింపుతుండగా గంజాయి మత్తులో ఉన్న యువకులు ఒక్కసారిగా నిప్పంటించినట్లు తెలుస్తోంది. దీంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.