గన్నవరం టీడీపీలో రచ్చ రచ్చ
గన్నవరం తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు రోడ్డు మీదకు వచ్చాయి. తోటి నేతలపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విరుచుకుపడ్డారు. వల్లభనేని వంశీతో కలిసి కొంత మంది టీడీపీ నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని.. సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైసిపి పార్టి లో పని చేస్తుంన్నందుకు సిగ్గు పడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో నలుగురు టీడీపీ మాజీ శాసనసభ్యులు ఉన్నారని అందర్నీ సమన్వయం చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.