సీఎం మమతతో వేదిక పంచుకోనని ప్రకటించిన గవర్నర్ ఆనంద బోస్
కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీతో బహిరంగ వేదికలను పంచుకోనని ప్రకటించారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు, న్యాయం కోసం ఆందోళన చేస్తున్నవారి తరపున నిలబడతానని ఆయన తెలిపారు.