
నల్గొండ: దారి దోపిడీ ముఠా అరెస్ట్
అర్ధరాత్రి అవరాగా తిరుగుతూ ఒంటరి వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారిపై దాడి చేస్తూ దోపిడికి పాల్పడుతున్న నలుగురు యువకులను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారిదోపిడి ముఠా నుంచి రెండు మోటార్ సైకిళ్ళు, రూ. 600 నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీన పరచుకుని బుధవారం రిమాండుకు తరలించినట్లు సీఐ రాఘవులు, ఎస్సై సైదులు తెలిపారు. కేసు చేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.