Top 10 viral news 🔥
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
మెదక్లో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమను తిరస్కరించడంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. దివ్యవాణి అనే యువతిని చేతన్ అలియాస్ కిరణ్ అనే యువకుడు ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. ఆమె నిరాకరించడంతో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న యువతిని అడ్డగించి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి చేతికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.